నవతెలంగాణ-హైదరాబాద్: కులవివక్షతో పలువురు సీనియర్ అధికారులు తనపై వేధింపులకు పాల్పడ్డారని సూసైడ్ నోట్‌లో పేర్కొంటూ..ఇటీవల ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ తుపాకీతో కాల్చుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే హర్యానాలో మరో పోలీస్ అధికారి మరో పోలీస్ అధికారి మరణించారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ) సందీప్ కుమార్ మరణించారు. వారం రోజుల వ్యవధిలో మరో పోలీస్ అధికారి మరణించడం గమనార్హం. అయితే ఆయనది ఆత్మహత్య లేదా హత్య నిర్ధారణ కావాల్సి వుంది.
రోహ్‌తక్‌లోని లాధోట్ గ్రామంలోని వ్యవసాయ పొలం సమీపంలో నిర్మించిన గదిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్‌ను నిందించినట్లు తెలుస్తోంది. అయితే విచారణ జరుగుతోందని, మరిన్ని వివరాలు తరువాత వెల్లడిస్తామని ఎస్‌పి రోహ్తక్ సురేంద్ర సింగ్ తెలిపారు. సందీప్ కుమార్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీపరుడైన అధికారి అని, కష్టపడి పనిచేసేవాడని అన్నారు. ఇటీవల ఆయనను సైబర్