- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రయివేట్ బస్సుల్లో అగ్నిప్రమాద మరణాలు ఆగడం లేదు. కర్నూలు ఘటన మరువకముందే రాజస్థాన్లోని జైపూర్-ఢిల్లీ రహదారిపై ఓ బస్సు దగ్ధమై ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రన్నింగ్లో ఉండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఇటీవల జైసల్మేర్లో 26 మంది, రెండ్రోజుల క్రితం కర్నూలులో 19 మంది ఇలాగే ప్రైవేట్ బస్సుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే
- Advertisement -



