అగ్ర కథానాయకుడు బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ), గోవా ప్రభుత్వంతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా సంయుక్తంగా 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ)ని ఈనెల 20న నిర్వహిస్తున్నాయి. ఇఫీ ఆరంభ వేడుకలో బాలకృష్ణని ఘనంగా సత్కరించనున్నారు. భారతీయ సినీ రంగంలో అర్ధ శతాబ్ద కాలం పాటు తన అపూర్వమైన నటనతో, దాదాపు 100కిపైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ఇఫీ- 2025 ప్రత్యేకంగా జరుపుకోనుంది.
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, కళాకారులు, ప్రతినిధులు, సినీభిమానుల సమక్షంలో ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు. ఆరంభ వేడుకలో ప్రముఖ నిర్మాణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సాంస్కృతిక బృందాలు పాల్గొనే అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఇందులో భాగమవుతాయి. ఇవి భారతీయ కథా సంప్రదాయం, సంస్కృతి, సినీప్రతిభను ప్రతిబింబిస్తాయి. పద్మభూషణ్, మూడు నంది అవార్డులు విజేత బాలకృష్ణ తన అద్భుతమైన నటన, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, గొప్ప అభిమానగణంతో తెలుగు సినిమా ప్రపంచంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. భారతీయ కథనానికి, తెలుగు సంస్కృతికి ఆయన ఒక గొప్ప ప్రతినిధిగా నిలిచారని చెప్పడంలో సందేహం లేదు.
మరో అరుదైన గౌరవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



