- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి వద్ద నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటనపై మానకొండూరు సీఐ సంజీవ్ దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



