Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో మ‌రో ఘోర ప్ర‌మాదం..8 మంది మృతి

ఏపీలో మ‌రో ఘోర ప్ర‌మాదం..8 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 8 మంది మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -