దంతవాడలో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఫలించిన పునరావాసం, లోన్ వరాట్
నవతెలంగాణ-చర్ల
ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం 71 మంది మావోయిస్టులు చత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల నిర్మూలన లోన్ వర్రాతు (ఇంటికి తిరిగి రండి) ప్రచారాన్ని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బస్తర్ రేంజ్ సుందర్‌రాజ్ పి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దంతేవాడ రేంజ్ శ్రీ కమలోచన్ కశ్యప్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (టెరిటరీ) సీఆర్పీఎఫ్ దంతేవాడ రేంజ్ శ్రీ రాకేష్ చౌదరి, పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రారు, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఉదిత్ పుష్కర్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దంతేవాడ రామ్‌కుమార్ బర్మాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. బస్తర్ డివిజన్‌లో నిర్వహిస్తున్న లొంగుబాటు పునరావాసం-పూనా మార్గెం (పునరావాసం ద్వారా పునరుజ్జీవనం) ప్రచారం, దంతే వాడ జిల్లాలో నిర్వహిస్తున్న లోన్ వర్రాటు (ఇంటికి తిరిగి రండి) ప్రచారం ద్వారా ప్రభావితమై 71 మంది మావోయిస్టులు (21 మంది మహిళలు, 50 మంది పురుషులు) లొంగిపోయారు.
లొంగిపోయిన మావో యిస్టు బామన్ మద్కంపై రూ.8 లక్షల రివార్డు, మహిళా మావోయిస్టు దేవే అలియాస్ కవితా మద్వి 5 లక్షలు, మావోయిస్టు జోగా మద్కంపై 2 లక్షల రివార్డు ఉంది. మొత్తంగా లొంగిపోయిన 71మందిలో 30మంది మావో యిస్టులపై సుమారు రూ.64లక్షల వరకు రివార్డు ఉన్న ట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ”పునా మార్గెం” (పునరావాసం ద్వారా పునర్జన్మ) కింద, జిల్లా పోలీసు దళం, సీఆర్పీఎఫ్ నిరంతర సంప్రదింపుల ద్వారా ప్రభుత్వ మావోయిస్టు పునరావాస విధానాన్ని గ్రామాల్లో విస్తృ తంగా ప్రచారం చేస్తుండటంతో మావోయిస్టుల కార్య కలాపాలు తగ్గిపోతున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగి పోయిన వారిలో అనేక మంది పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నవారున్నారు. లొంగి పోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.