- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన ఢాకా కోర్టు ఏడేళ్ల చొప్పున మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఒక్కో కేసులో రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేకుంటే మరో 18 నెలలు జైలు శిక్ష పొడిగిస్తామని తీర్పునిచ్చింది. హసీనా కూతురు, కుమారుడిపై నమోదైన కేసుల్లో కోర్టు వారిద్దరికీ 5ఏళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కో లక్ష ఫైన్ కట్టాలని తీర్పునిచ్చింది.
- Advertisement -


