హీరో ధనంజయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. ఇప్పటికే పలువురు స్టార్స్‌తో నిండిన ఈ సినిమాలోకి ఇప్పుడు పాపులర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
రెండు వేర్వేరు పోస్టర్లలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్స్‌లో ప్రియాంక మోహన్ తీరు చూస్తుంటే అందం, రహస్యం, ఫాంటసీ అన్నీ కలిగలిసిన ఓ వైవిధ్యమైన, ప్రత్యేకమైన కథా ప్రపంచం ఈ సినిమాలో ఉండబోతున్నట్టుగా అనిపిస్తోంది. దీంతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన డా. శివరాజ్‌కుమార్, ధనంజయ ఫస్ట్ లుక్స్ నుంచి భారీ సెట్స్, వింటేజ్ కెమరాలతో, సినిమాపై ఆసక్తిని పెంచే అంశాలున్న ఒక ప్రత్యేక ప్రపంచాన్ని రూపొందించేందుకు చిత్రబృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జనవరిలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను వైశాక్ జె ఫిలిమ్స్ బ్యానర్‌పై హేమంత్ ఎం.రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ సంగీత సారథ్యాన్ని వహిస్తుండగా, అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఇంచారా సురేష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘666..’లో మరో సర్‌ప్రైజ్
- Advertisement -
- Advertisement -



