- Advertisement -
దివంగత విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి (75) సోమవారం కన్నుమూశారు.
కోట శ్రీనివాసరావు జూలై 13న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇకలేరన్న వార్తను పూర్తిగా మరువకముందే ఆయన సతీమణి మృతి చెందడం కుటుంబ సభ్యులతోపాటు, అందరినీ కలచివేస్తోంది.
రుక్మిణితో కోట శ్రీనివాసరావుకు 1966లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తనయుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
- Advertisement -