Thursday, January 22, 2026
E-PAPER
Homeక్రైమ్ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

- Advertisement -

– అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య
నవతెలంగాణ – మీర్‌పేట్‌

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బలవుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. బెట్టింగ్‌లో పెద్దఎత్తున డబ్బు పోగొట్టు కుని అప్పుల్లో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధు వులు తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనంలో నివాసముంటున్న కోట్టల లక్ష్మీకాంత్‌(24) సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. అందుకోసం స్నేహితులు, బంధువుల దగ్గర చాలా అప్పులు చేశాడు. బెట్టింగ్‌లలో లక్షల్లో నష్టపోయి మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లోనే బాత్రూమ్‌లో ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మీర్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ కుమార్‌ నాయక్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -