Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం10న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం

10న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం

- Advertisement -

– మహిళా సంఘాల ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 10న సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలని వివిధ మహిళా సంఘాల నేతలు, మేధావులు, న్యాయవాదులు పిలుపునిచ్చారు. అదే రోజు సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలేను స్మరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఈమేరకు అరుణ (పీవోడబ్ల్యూ స్త్రీ విముక్తి), సుజ్ఞానమ్మ (పీవోడబ్ల్యూ స్త్రీ విముక్తి ఏపీ), విమలక్క (అరుణోదయ ఏసీఎఫ్‌), ప్రొఫెసర్‌ కె.లక్ష్మి (బహుజన బతుకమ్మ), ప్రొఫెసర్‌ మనోజ్ఞ (ఆదివాసి జీవిత పరిశోధకురాలు), అనసూయ (శ్రామిక శక్తి బీడీ వర్కర్స్‌ యూనియన్‌), సజయ (సామాజిక కార్యకర్త), ప్రొఫెసర్‌ కొల్లాపురం విమల (ఉమెన్స్‌ కలెక్టివ్‌), వె.ౖజ్యోతి (కుల నిర్మూలన సంఘం), అంభిక (సామాజిక కార్యకర్త), తాయమ్మ కరుణ (రచయిత్రి), తుర్లపాటి లక్ష్మి (రచయిత్రి), లక్ష్మీదేవి (న్యాయవాది), డాక్టర్‌ సి. అనిత (అరుణోదయం), వెంక లక్ష్మి (ఏఐఎఫ్‌టీయూ), లావణ్య (పీవోడబ్ల్యూ స్త్రీ విముక్తి), ప్రియ (డిజిబుల్‌ అక్టివిస్ట్‌), పూజ (అరుణోదయ), ఏ. రాజేశ్వరి (రంగవల్లి విజ్ఞాన కేంద్రం), భూలక్ష్మి (నవయుగ బీడీ కార్మిక సంఘం), పలస నిర్మల (ప్రజాగాయని) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మహిళలు వెలకట్టలేని కుటుంబ శ్రమ చేయడం, సమాన పనికి సమాన వేతనం పొందకపోవడం వల్ల ప్రపంచ మహిళలు నిత్యం యుద్ధ వాతావరణంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయిల్‌ సామ్రాజ్యవాద, జియోనిస్టు శక్తులు ఇరాన్‌పై దాడి చేసి పశ్చిమాసియాలో సృష్టించిన యుద్ధ బీభత్సవం వల్ల మూడో ప్రపంచ యుద్ధ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -