హాజరుకానున్న రాఘవులు, నారాయణ, ఇతర నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు చార్మినార్ వద్ద ప్రారంభమ య్యే ఈ ర్యాలీ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, ఆప్ పార్టీల నేతలు, జమాతే ఇస్లాం, తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.
నేడు యుద్ధ వ్యతిరేక ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


