- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కొడ్ లు, విద్యుత్ సవరణ చట్టం, విత్తనబిల్లు, విబిజి రాంజీ చట్టం, బీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడుల అనుమతి వంటి చట్టాలను రద్దు చేయాలని కోరుతూ శనివారం మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామపంచాయతీలో తీర్మానం చేయాలని సర్పంచ్ మాదమమత సైదులుకు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఇట్టి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రధానమంత్రి కి పంపించాలని పాలకవర్గసభ్యులనువినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలోనాయకులు పెంజర్ల దేవేంద్రబాబు, రాధాకృష్ణ, పులిగిల్ల సైదులు, ఉప్పలపల్లి శంకర్, చిలుకూరు సైదులు ఉన్నారు.
- Advertisement -



