నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2015 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనురాగ్ జయంతి గతంలో భోధన్, ఖమ్మం జిల్లాలో సబ్ కలెక్టర్ గా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా, జి హెచ్ఎంసి పరిధిలో ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ గా పని చేశారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి రాజేంద్ర నగర్ లో జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతి బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, వైద్య రంగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అట్టడుగు ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సమగ్ర అభివృద్ధి దిశ గా జిల్లా ముందుకు సాగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతి
- Advertisement -
- Advertisement -



