నవతెలంగాణ-హైదరాబాద్ : లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తన కెరీర్ స్పీడ్ పెంచింది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి విజయాన్ని అందుకుని, ఆమెకు మళ్లీ బజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు అనుష్క మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘ఘాటి’. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్ జాగర్లమూడి. ఈ క్రేజీ కాంబినేషన్ గతంలో వేదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరిచింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఘాటి కోసం జతకట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా కోసమే క్రిష్ తన మరో సినిమా హరిహర వీరమల్లును తాత్కాలికంగా విరమించాడన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
అనుష్క శెట్టి ఘాటి ట్రైలర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES