No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమా'ఘాటి'లో అనుష్క విశ్వరూపం చూపించాం

‘ఘాటి’లో అనుష్క విశ్వరూపం చూపించాం

- Advertisement -

అనుష్క శెట్టి మోస్ట్‌ ఎవైటెడ్‌ యాక్షన్‌ డ్రామా ‘ఘాటి’. విక్రమ్‌ ప్రభు మేల్‌ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్ల మూడి నిర్మించారు. సెప్టెంబర్‌ 5న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ మాట్లాడుతూ, ‘కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ‘ఘాటి’ అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్న ఒక తీవ్ర మైన భావోద్వేగాలు, చాలా గట్టి మనుషులు, గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది. చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. మొదటిగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించ బోతున్నాం. సెన్సార్‌కి ఇచ్చేముందు కాపీ చూసుకుని అనుష్కకి ఫోన్‌ చేశాను. తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఒక ఫైనెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అని చెప్పాను. అదే మాట ఆడియన్స్‌ కచ్చితంగా చెప్తారు. ఈ కథ రాస్తున్నప్పుడే శీలావతి పాత్ర అనుష్క చేయాలని నేను, మా ప్రొడ్యూసర్లు డిసైడ్‌ అయ్యాం. కనీ, విననీ పాత్రలు ఇందులో చూస్తారు. ఈ సినిమాలో ఒక అందమైన సోల్‌ ఉంది. ఆడియన్స్‌ ఆ సోల్‌ని మనసులో నింపుకుని వెళ్తారు’ అని అన్నారు. ‘అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో చాలా ఘాటుగా ఉండబోతుంది. అన్ని రియల్‌ లొకేషన్స్‌లో చేసిన సినిమా ఇది. ఇందులో నేను పోలీస్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. నా క్యారెక్టర్‌ మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? లేక రెండూ చేస్తుందా అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని జగపతిబాబు చెప్పారు. హీరో విక్రమ్‌ ప్రభు మాట్లాడుతూ,’దేశి రాజు క్యారెక్టర్‌లో నన్ను ఊహించుకొని రాయడం చాలా ఆనందాన్నిచ్చింది. అనుష్కకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో పాటు జగపతిబాబు, చైతన్య రావుతో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని తెలిపారు. చైతన్య రావు మాట్లాడుతూ,’ అనుష్క చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌తో వస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ చూసినప్పుడు నా క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్నిచ్చింది’ అని అన్నారు.

ఇందులో రియల్‌ క్వీన్‌గా అనుష్కని చూస్తారు. విక్రమ్‌ అద్భుతమైన పర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగమైన జగపతిబాబు, చైతన్యకి ధన్యవాదాలు. చాలా అద్భుతమైన సినిమా చేశాం. ఈ సినిమాపై మేమందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సెప్టెంబర్‌ 5న థియేటర్స్‌లో కలుద్దాం – ప్రొడ్యూసర్‌ రాజీవ్‌ రెడ్డి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad