సత్యసాయి దాన్ని నిరూపించారు : పుట్టపర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రేమతో ఏదైనా సాధించొచ్చని సత్యసాయిబాబా నిరూపించారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఆచరణలో చేసి చూపించారనీ, ఆ మార్గం అందరికీ ఆచరణయోగ్యమని చెప్పారు. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆశ్రమంలో జరిగిన శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారనీ, ప్రేమతో మనుషుల్ని, మనసుల్ని గెలిచి, తన సేవలతో దేవుడిగా పూజించబడుతున్నారని చెప్పారు. ఆయన నేడు ప్రజల మధ్య లేకున్నా, ఆయన స్ఫూర్తి అందరిలో ఉందన్నారు. సత్యసాయిబాబా ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకూ పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించారని కొనియాడారు. గతంలో పాలమూరు జిల్లాలో సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి చేసి వారి దాహార్తిని తీర్చారని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక సహా ప్రపంచ వ్యాప్తంగా బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయన్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్ని ఆచరణలో చేసి చూపించారని తెలిపారు. ప్రపంచంలో కోట్లాది మంది జీవితాల్లో సత్యాసాయిబాబా ఇదే స్ఫూర్తిని నింపారనీ, ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని వివరించారు. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించామనీ, రాష్ట్రంలో బాబా ట్రస్ట్ సేవల్ని విస్త్రుతం చేసేందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పీసీ రాధాకృష్ణన్, మిజోరాం గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆరాష్ట్ర విద్య, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమతో ఏదైనా సాధించొచ్చు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



