నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ రైతు వేదిక యందు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎరువుల దుకాణ యజమానులతో యూరియా పంపిణీ ప్రత్యేక యాప్ గురించి వివరించడం జరిగింది. ఇక నుంచి రైతులు యూరియా ఎరువు కొరకు ఇంటి నుంచే యాప్ ద్వారా బుకింగ్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. మండలంలో ఉన్న ఎరువుల వివరాలు ఈ యాప్ డీలర్ వారిగా ఎన్ని యూరియా బస్తాలు ఉన్నాయి అనేది ఈ యాప్ లో చూడొచ్చని తెలిపారు.
మండల రైతులు ఇకనుంచి యూరియా పక్కదారి పట్టకుండా మన మండల రైతులకే అమ్ముకునే విధంగా ఉంటుంది. రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం ప్రకారం ,పంట ఆధారంగా, ఏ పంటకి ఎంత యూరియా అవసరం అయితే అంతే యూరియా పంపిణీ చేయబడును. చిన్న రైతులకు ఒకే విడతలో మరియు పెద్ద రైతులకు విడతల వారిగా పంపిణీ చేయడం జరుగును. రైతులు తమ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి యూరియా బుక్ చేసుకొని 24 గంటలంలో తమకి నచ్చిన డీలర్ దగ్గర లేదా సొసైటీ యందు కొనుగోలు చేసుకోవచ్చు. కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. మండల రైతులు ఈ యాప్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును. వివరాలకు మీ మీ గ్రామ ఏఈవో ద్వారా తెలుసుకోవచ్చును. ఈ కార్యక్రమంలో మండల ఆయా గ్రామాల ఏఈవో లు మరియు మండల ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.



