Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఓ

పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
గత మూడు, నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు నీట ముడిగిన పంటలను జుక్కల్ మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి శుక్రవారం పలు గ్రామాలలో క్షేత్రస్థాయి పంటల పరిశీలన చేశారు. గ్రామాలలోని పలువురు రైతులకు వారి వంట నష్టం సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏవో మహేశ్వరి మాట్లాడుతూ.. మండలంలోని కేమ్రాజ్ కల్లాలి, రుద్రపహాడ్ , ఖండే బల్లూర్ గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. ఈ పరిశీలనలో భారీ వర్షాలకు వరి పంట నీటిలో మునిగిపోయిందని, మీరు బయటికి వెళ్లిపోయిన తర్వాతే వరి పంట స్థితిగతులను పరిశీలించి తెలియజేస్తామని అన్నారు.

అదేవిధంగా సోయా పంట కాయ దశలో ఉందని తెలిపారు. సోయపంట నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉండడం వలన సోయా కాయలకు బూజుపట్టే అవకాశం ఉందని అన్నారు. సుమారుగా సోయా పంట పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం పొంచిఉందని తెలిపారు. కంది పంటలో ప్రస్తుతం నీరు నిలిచి ఉండడంతో పంట వేళ్ళు మురుగు నీటీలో మునిగి, కుళ్లిపోయి బూజు పట్టి పంట నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా పెసర పంట కోతకు వచ్చిందని, మినుము పంట కూడా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మండలంలో వివిధ పంటలకు నష్టం భారీగానే వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ పంట నష్ట పరిహారం వివరాలు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత భూమి ఎండుతున్న క్రమంలో వ్యవసాయ శాఖ ఏడు క్లస్టర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ లతో, అధికారులు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతు పంట చెళ్ళకు వెళ్లి నష్టపరిహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేసి నివేదికలు తయారు చేస్తామని అన్నారు. అనంతరం నష్టపరిహారం జరిగే పంటల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారికి నివేదికలు పంపించడం జరుగుతుందని తెలిపారు. అక్కడి నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కు పంపించి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని పేర్కొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad