నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ లో నకిలీ గడ్డి మందు పిచికారి మూలంగా ఎండిపోయిన సోయా పంటను క్షేత్రా స్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి పరిశీలించారు. ఈ మేరకు సోమవారం మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీతో కలిసి ఆయన గ్రామంలో క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతుల సోయా పంటను పరిశీలించారు. ఈ నెల 5న పలువురు సోయా సాగుచేసిన రైతులు వ్యవసాయ సిబ్బందికి మండల కేంద్రానికి చెందిన జే.భూమేశ్వర్ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపు యజమాని ఇచ్చిన నకిలీ గడ్డి మందు మూలంగా తమ సోయా పంటలను నష్టపోయామని ఇచ్చిన ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. గడ్డి మందు పిచికారి చేయడం వల్ల పంట నష్టం జరిగింది వాస్తవమేనని తెలిపారు. గ్రామంలో ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల సోయా పంటకు నష్టం జరిగిందనే వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, నకిలి గడ్డం ముందు విక్రయించిన షాపు యజమానిపై చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.
నష్టపోయిన సోయపంటను పరిశీలించిన ఏఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES