Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాభవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

ప్రజాభవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

- Advertisement -

భట్టి కుమారుడికి వివాహ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు విచ్చేసి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య దంపతులను ఆశీర్వదించారు. ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు భట్టి దంపతులు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, వారి భవిష్యత్‌ సుఖసంతోషాలతో సాగాలని ఆశీస్సులు అందజేశారు. వివాహ వేడుకకు రావాలని భట్టి స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి బాబును ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో బిజీ షెడ్యూల్‌ కారణంగా హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే శనివారం ప్రత్యేకంగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్‌ బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -