Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాన్హా శాంతి వనంలో ఏపీ సీఎం చంద్రబాబు

కాన్హా శాంతి వనంలో ఏపీ సీఎం చంద్రబాబు

- Advertisement -

– దాజీతో కలిసి శాంతివనం సందర్శన
నవతెలంగాణ-కొత్తూరు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతి వనాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ప్రత్యేక విమానంలో ఆయన కాన్హా శాంతి వనానికి చేరుకున్నారు. అక్కడ ఆయన దాజీతో కలిసి ఐదు గంటలపాటు కాన్హా శాంతి వనంలో కలియ తిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. అతిపెద్ద ధ్యాన కేంద్రం, ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం, యోగ సౌకర్యం, ఆర్ట్‌ ఫుల్‌నెస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ఆర్ట్‌ ఫుల్‌ నెస్‌ గోపీచంద్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీతో పాటు వృక్ష సంరక్షణ, రెయిన్‌ ఫారెస్ట్‌, బయోచర్‌ సౌకర్యాలను పరిశీలించారు. సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న శాస్త్రీయ వృక్షశాస్త్ర పరిశోధనల గురించి కాన్హా శాంతి వనం ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. అనంతరం జీవవైవిధ్యం పర్యావరణ కార్యక్రమాలను ప్రదర్శించే రెయిన్‌ ఫారెస్ట్‌ను సందర్శించారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అవలోకనంతో ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన మందిరం సందర్శించి అక్కడి మెడిటేషన్‌ హాల్‌ వెలుపల బాబూజీ వనం, బయోచర్‌ సెంటర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం గోపీచంద్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి వెళ్లారు. అక్కడ క్రీడాకారులకు ఇచ్చే శిక్షణ గురించి వివరించారు. ఆయన వెంట పలువురు అధికారులు, కాన్హా శాంతి వనం ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -