Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయందుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం

- Advertisement -

విజయవాడ : విజయవాడ కనక దుర్గమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించు కుని శ్రీ సరస్వతీ దేవి అలం కారంలో ఉన్న దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనవాయితీగా పట్టు వస్త్రాలను సమర్పించారు. సిఎం దంపతులకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని శివనాథ్‌, ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఇఒ శీనా నాయక్‌ తదితరులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేదపండితులు ప్రసాదాలు అందజేశారు
.
రూ.71 కోట్లతో దుర్గగుడి పనులు
అనంతరం మీడియా పాయింట్‌ వద్ద సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉత్సవాల్లో సాధారణ ప్రజలకు ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. రూ.71.50 కోట్లతో ఇంద్రకీలాద్రిపై వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న అన్నప్రసాద భవనం ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు.
రూ.27 కోట్లతో మూడు నెలల్లో కొత్తగా ప్రసాదం తయారీ కేంద్రాన్ని పూర్తి చేస్తామన్నారు. రూ.5.5 కోట్లతో పూజా మండపం నిర్మిస్తున్నామని, రూ.14 కోట్లతో ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ను ఐదు నెలల్లో పూర్తవుతుందన్నారు. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని, ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -