Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఏపీ హెచ్‌ ఎమ్‌ ఈ ఎల్‌. సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

ఏపీ హెచ్‌ ఎమ్‌ ఈ ఎల్‌. సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

- Advertisement -

తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఏపీ హెచ్‌ ఎమ్‌ ఈ ఎల్‌ (ఆంధ్ర ప్రదేశ్‌ హెవీ మిషనరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌) ఎదగాలని తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీ హెచ్‌ ఎమ్‌ ఈ ఎల్‌ ను సింగరేణి సీఎండీ బలరాం తో కలిసి సందర్శించారు. కొండపల్లి కి వచ్చిన భట్టిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్‌ భట్టికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో, మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడి భాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్‌ సంస్థలకు ఏపీ హెచ్‌ ఎమ్‌ ఈ ఎల్‌ కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సింది ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని, మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీ ని నియమిస్తాం అన్నారు. వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్తు ప్రణాళిక పై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామని, తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రాష్ట్రాల ప్రగతికి దోహద పడవచ్చు అని తెలిపారు. సంస్థను, మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలి, యంత్రాలకు ఓవరాలింగ్‌ చేయాలి, రంగులు వేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు. కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతోనే ఈ పరిశ్రమ ముందుకు పోతుందని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్‌ కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మతు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశానికి అవసరమైన ఆర్డర్స్‌ తీసుకొని బీహెచ్‌ ఈ ఎల్‌ మాదిరిగా ఎపి హెచ్‌ ఎమ్‌ ఈ ఎల్‌ పనిచేస్తుందని ఆకాంక్షించారు. థర్మల్‌ పవర్‌ స్టేషన్స్‌ కు అవసరమైన యంత్రాలు, యంత్రాల మరమ్మతు చేస్తుందని, ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివద్ధి చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad