Tuesday, July 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ హైకోర్టు నూతన సీజేగా అపరేష్‌ కుమార్‌ సింగ్‌

తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా అపరేష్‌ కుమార్‌ సింగ్‌

- Advertisement -

తొమ్మిది రాష్ట్రాల్లో సీజేలకు రాష్ట్రపతి ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియమితు లయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు సీజేగా సేవలందిస్తోన్న జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ బదిలీపై తెలంగాణకు హైకోర్టుకు రానున్నారు. ఈ మేరకు సోమవారం దేశంలోని ఐదు రాష్ట్రాలకు సీజేల నియామకం, నాలుగు రాష్ట్రాలకు సీజేల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. తాజాగా మొత్తం 9 రాష్ట్రాలకు సీజేల నియామకం/ బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియ ం సిఫారసులను రాజ్యాంగం కల్పించిన అధికారాలతో రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘావాల్‌ ‘ఎక్స్‌’ వేదికగా
వెల్లడించారు. సీజేల నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలిపారు. అందులో భాగంగా జస్టిస్‌ మణింద్ర మోహన్‌ శ్రీవాస్తవను రాజస్థాన్‌ నుంచి మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను త్రిపుర నుంచి తెలంగాణ హైకోర్టుకు, జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావును జార్ఖండ్‌ నుంచి త్రిపురకు, జస్టిస్‌ కెఆర్‌ శ్రీరాంను మద్రాస్‌ నుంచి రాజస్థాన్‌కు బదిలీ అయ్యారు. అలాగే మధ్యప్రదేశ్‌ యాక్టింగ్‌ సీజే జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌ దేవ్‌ ఆ రాష్ట్రానికి సీజేగా, ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్‌ విభు బక్రూ.. కర్ణాటక సీజేగా, పాట్నా హైకోర్టు యాక్టింగ్‌ సీజే జస్టిస్‌ అశుతోష్‌ కుమార్‌..గౌహతి సీజేగా, పాట్నా జడ్జీ జస్టిస్‌ విపుల్‌ మనుభారు పంటోలిని..పాట్నా సీజేగా, హిమాచల్‌ ప్రదేశ్‌ జడ్జీ జస్టిస్‌ టీఎస్‌ చౌహాన్‌..జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -