Saturday, February 28, 2026
E-PAPER
Homeబీజినెస్తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి

తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ఫార్మసీ నెట్‌వర్క్ ‘అపోలో ఫార్మసీ’ తెలంగాణాలో తన 1,000వ స్టోర్‌ మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో అపోలో ఫార్మసీ తన కార్యకలాపాలను విస్తరించింది. రిటైల్, డిజిటల్, సప్లై చైన్ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ నెట్‌వర్క్ ద్వారా 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఐదు లక్షల మంది 24/7 వినియోగదారులు ఉన్నారు. ప్రాంతీయ నెట్‌వర్క్, సమగ్ర సరఫరా వ్యవస్థతో అపోలో ప్రతిరోజూ 1.65 లక్షలకు పైగా మందుల ఆర్డర్లు అందిస్తోంది. రాబోయే మూడేళ్లలో తెలంగాణలో మరో 200 పైగా కొత్త ఫార్మసీ స్టోర్లను ప్రారంభించనున్నారు.
 తెలంగాణలో 33 జిల్లాల్లో 1000 స్టోర్లు
– 50,000 పైగా నాణ్యమైన మందులు, ఇతర వెల్నెస్ ఉత్పత్తులు
– ప్రతిరోజూ 1.65 లక్షలకు పైగా మందుల ఆర్డర్లు
– 10,000 మందికి పైగా ఉద్యోగులు
– 25 లక్షల మంది 24/7 వినియోగదారులు- రాబోయే మూడేళ్లలో తెలంగాణలో 
ఈ సందర్భంగా ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ నాణ్యమైన ఆరోగ్య సేవలు మాత్రమే కాకుండా మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కూడా ముందున్నామన్నారు. మహిళలకు స్థిరమైన కెరీర్, నాయకత్వ అవకాశాలు, ఆర్థిక స్వాతంత్ర్యం అందించే పని వాతావరణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇది తమ కుటుంబాలను, సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. అత్యధిక స్టోర్లు 24 గంటల పాటు పని చేస్తాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ మందుల హోమ్ డెలివరీ సదుపాయం కలదన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు సెమీ-అర్బన్ ప్రాంతాల్లో కూడా అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా విస్తరణ చేపట్టామన్నారు. ప్రాంతీయ నెట్‌వర్క్, సమగ్ర సరఫరా వ్యవస్థతో అపోలో ప్రతిరోజూ 1.65 లక్షలకు పైగా మందుల ఆర్డర్లను అందిస్తోందని చెప్పారు. రాబోయే మూడేళ్లలో తెలంగాణలో మరో 200 పైగా కొత్త ఫార్మసీ స్టోర్లను ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ విజయం నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ చేరువ చేయాలన్న మా నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందన్నారు. కుటుంబాలు, కమ్యూనిటీలు తమ సొంతంగా భావించే ఒక నమ్మకమైన ఫార్మసీ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యమన్నారు. అపోలో ఓమ్నీ ఛానల్ ప్లాట్‌ఫారమ్ ‘అపోలో 24/7’ ద్వారా ప్రజలు తమ ఇంటి వద్దే సమగ్ర వైద్య సేవలను పొందవచ్చన్నారు. ఇందులో అపోలో వైద్యులతో టెలీ-కన్సల్టేషన్లు (వీడియో కాల్ ద్వారా సలహాలు), డయాగ్నస్టిక్ సేవలు, ప్రత్యేక ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -