Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అప్పం కిషన్‌కు చైర్మన్ పదవి ఇవ్వాలి

అప్పం కిషన్‌కు చైర్మన్ పదవి ఇవ్వాలి

- Advertisement -

యాదవ సంఘం జిల్లా నాయకుడు కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి అప్పం కిషన్ యాదవ్ 9వ వార్డు నుండి భారీ మెజార్టీతో విజయం సాధించారని ఆయనకు చైర్మన్ పదవి ఇవ్వాలని యాదవ సంఘం జిల్లా నాయకుడు చింతల కుమార్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వ అధిష్టానానికి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదిహేనేళ్లుగా ప్రజల సమస్యలపై అవగాహనతో, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవలు అందిస్తున్న నాయకుడు అప్పం కిషన్ యాదవ్ అని పేర్కొన్నారు.

మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు అతీతంగా విశేష ఆదరణ పొందిన ఆయనను 9వ వార్డు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించుకున్నారని తెలిపారు. సౌమ్యుడు, ప్రజల మనిషి, ఎమ్మెల్యే విధేయుడిగా ఎల్లప్పుడూ పార్టీ ఆదేశాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న యువ నాయకుడైన అప్పం కిషన్ యాదవ్‌కు చైర్మన్ పదవి కేటాయిస్తే మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కలుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -