నవతెలంగాణ – కాటారం
కాటారం మండల పరిధిలోని పశువైద్యశాలలు సక్రమంగా సేవలందించాలంటే శాశ్వత భవనాలు అత్యవసరమని ప్రజలు, రైతులు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మండల కేంద్రంలో శాశ్వత భవనం ఏర్పాటు చేసినప్పటికీ, ధన్వాడ, ఒడిపిలవంచ, దామరకుంట గ్రామాల పశువైద్యశాలలు మాత్రం ఇప్పటికీ తాత్కాలిక గదుల్లోనే కొనసాగుతున్నాయి.గ్రామపంచాయతీ భవనాల్లో చిన్న గదులు కేటాయించినప్పటికీ, వాటితో సరిపెట్టుకోవాల్సి వస్తోందని, పశువైద్య సేవలందించడంలో విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్లు, రైతులు, ప్రజలు చెబుతున్నారు.
పశువులకు చికిత్స చేయడానికి సరిపడిన స్థలం లేకపోవడం, అవసరమైన పరికరాలను నిల్వ ఉంచడానికి తగిన సౌకర్యం లేకపోవడం వంటి అనేక సమస్యలు నిరంతరం ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పశుసంవర్ధకంపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న గ్రామీణ రైతులు కూడా ఇదే సమస్యను ఎత్తి చూపుతున్నారు. “మన పశువుల కోసం ఎప్పుడూ వెటర్నరీ డాక్టర్ అవసరం అవుతాడు. కానీ చిన్న గదుల్లో సౌకర్యాలు లేకపోవడంతో చికిత్స సక్రమంగా జరగడం కష్టమవుతోంది” అని రైతులు వాపోతున్నారు.ఈ నేపథ్యంలో మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి కాటారం లోని పశువైద్యశాలలకు శాశ్వత భవనాలు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత భవనాలు ఏర్పడితే పశుసంవర్ధక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
పశువైద్యశాలలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES