నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నాడు సమైక్యాంధ్రాలో 3గా వున్న మెడికల్ కాలేజీ లను నేడు తెలంగాణ రాష్ట్రంలో 36 కు చేరుకున్నాయి అని హెచ్ ఓ డి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని ఉదేశ్యంతో తొదరపాటు చెర్య వలన నేడు పెంచిన మెడికల్ కాలేజీ ల మనుగడ ఆగమ్యగొచరంగా మారిన తరుణంలో నేటి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ల మనుగడ చక్క దిద్దే చెర్యలోభాగంగా చారిత్రాత్మాక నిర్ణయాలు తీసుకొంటుంది అని తెలిపారు.
అందులో భాగంగానే గత సంవత్సరం జరిగిన జెనరల్ ట్రాస్ఫర్స్ లోకూడా రూరల్ ప్రాంతంలో వున్న డాక్టర్స్ ని ట్రాన్స్ఫర్లో అనుమతించ కుండా సంవత్సరాలనుండి హైదరాబాద్ లోపాతుకు పోయిన డాక్టర్స్ ని రూరల్ మెడికల్ కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అన్నారు . నాడు రూరల్ ప్రాంతం లో గత 3 మరియు 4 సంవత్సరాలనుండి పనిచేస్తున్న డాక్టర్స్ రూరల్ మెడికల్ కాలేజీల మనుగడకు కట్టుబడి ప్రభుత్వానికి సహకరించడం జరిగింది అన్నారు.
ఐ నా నేడు రూరల్ మెడికల్ కాలేజీ లలో అసోసియేట్ మరియు ప్రొఫెసర్స్ పోస్టుల కొరత ఉండడం వలన మరల ప్రభుత్వం చరిత్రత్మాక నిర్ణయం తీసుకొనే చెర్యలో భాగంగా నేడు ప్రొఫెసర్స్ ప్రమోషన్స్ అరహతా లేని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని కూడ ప్రాధాన్యత ఇచ్చి ప్రొఫెసర్స్ గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది వారికి వారి సాలరీ బేసిక్ కూడ అమ్మాంతం 144000 చేరుకొంటుంది అన్నారు. అరహతా లేకున్నా ఇటు ప్రమోషన్ అటు సాలరీ అదనంగా 50000పై బడి పెంచడం జరుగుతుంది
ఈ చరిత్రత్మక నిర్ణయాన్ని స్వాగతించే తరుణంలో కొందరు దూరాశ పరులు గత అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ గా హైదరాబాద్ లో తిష్ట వేసిన వారు ప్రొఫెసర్ ప్రమోషన్ పేరుతో హైదరాబాద్ లోనే ఉండాలని కుట్రకు తెరదీసి గత జనరల్ ట్రాన్స్ఫర్ లో ఖాళీలుగా వున్న ప్రొఫెసర్ పోస్టులను తమతో నింపాలని ప్రభుత్వంతో వితండ వాదానికి దిగుతూ మీడియాని పక్కదారి పట్టిస్తున్నారు అని మండిపడ్డారు. జనరల్ ట్రాన్స్ఫర్ లో వేకెన్ట్ ఐన ప్రొఫెసర్ పోస్టులను వేకెంట్ గా ఉంచి మల్లీ జనరల్ ట్రాన్స్ఫర్ లో హరువులైన అంటే రూరల్ సర్వీస్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొన్నా సీనియర్ ప్రొఫెసర్స్ కి చోటు దక్కాలని ఒక సదుదేశంతో ప్రభుత్వం కఠిన పారదర్శక నిర్ణయాన్ని తీసుకొంది అన్నారు.
జనరల్ ట్రాన్స్ఫర్ లో వేకెంట్ ఐన ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్టు ప్రొఫెసర్స్ ని తీసుకోవాలని మంచి నిర్ణయానికి వొచ్చి ఇటు మెడికల్ కాలేజీ ల మనుగడ కొనసాగాలని చూడడానికి అరహతా లేని అసోసియేట్ ప్రిఫెసర్స్ కి జీతం పెంచి ప్రొఫెసర్స్ గా పదోన్నతి కల్పించడం, గత నాలుగు సంవత్సరాలనుండి నూతన మెడికల్ కాలేజీ ల మనుగడ ప్రశ్నర్థం కాకుండా హహర్నిశలు కృషి చేసిన ప్రొఫెసర్స్ కి రాబోయే ట్రాన్స్ఫర్స్ లో ప్రాధాన్యత కల్పించాలని ముందుకు వెళుతున్న తరుణంలో కొందరు దుర్మార్గంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ తమ స్వార్థ బుద్దితో హైదరాబాద్ లో ప్రొఫెసర్ లు గా పదోన్నతి పొంది తిష్ట వేయాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. అలాంటి వారి చేష్టలను నిషితంగా ప్రభుత్వం గమనించాలని కోరారు.