Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఆపిల్‌ కొత్త సిఒఒగా సబిహ్‌ఖాన్‌

ఆపిల్‌ కొత్త సిఒఒగా సబిహ్‌ఖాన్‌

- Advertisement -

– భారత సంతతి వాసికి కీలక బాధ్యతలు
శాన్‌ఫ్రాన్సిస్కో :
దిగ్గజ టెక్‌ కంపెనీ ఆపిల్‌ నూతన చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సిఒఒ)గా సబిహ్‌ఖాన్‌ నియమితులయ్యారు. భారతీయ మూలాలున్న సబిహ్‌ఖాన్‌ ఈ కొత్త బాధ్యతలను జులై చివరలో స్వీకరించనున్నారు. ప్రస్తుత సిఒఒ జెఫ్‌ విలియమ్స్‌ రాజీనామా చేయడంతో ఆ కంపెనీ సిఇఒ టిమ్‌ కుక్‌ అదనపు బాధ్యతలను చూస్తున్నారు. సబిహ్‌ఖాన్‌కు ఆపిల్‌లో 30 ఏళ్ల అనుభవం ఉంది. గత ఆరేళ్లుగా యాపిల్‌ గ్లోబెల్‌ సప్లయి చెయిన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఉత్పత్తి కార్యకలాపాలనూ పర్యవేక్షిస్తున్నారు. ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్‌ గ్రేడ్‌ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపుర్‌కు అక్కడి నుంచి అమెరికాకు వలస వెళ్లింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad