• మండల వ్యవసాయ అధికారి సాహస్
నవతెలంగాణ – మర్రిగూడ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా (వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం – యాసంగి 2025-26) సంబంధించి 28.02.2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం పొందుటకు రైతుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారి సాహస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తుకు కావలసిన పత్రాలు:
1.పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయిన జిరాక్స్ 2.ఆధార్ కార్డు జిరాక్స్ 3.బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్ 4.పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం.పత్రాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి కి చివరి తేదీ ఈ నెల 20 శుక్రవారం లోపు సమర్పించాలని సూచించారు. గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని తెలిపారు.



