Saturday, November 1, 2025
E-PAPER
Homeజిల్లాలుకేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ 

కేజీబీవీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ 

- Advertisement -

స్పెషల్ ఆఫీసర్ ఇర్ప పుష్పనీలా 
నవతెలంగాణ – తాడ్వాయి 

మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, సిఈసి గ్రూప్ నందు స్పాట్ అడ్మిషన్ల కై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ ఇర్ప పుష్పనీలా తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు 15 అడ్మిషన్లు ఉన్నట్లు, అలాగే పాఠశాలలో కూడా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్పాట్ అడ్మిషన్లు తీసుకోనునట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినిలకు మొదటి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -