Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుజుక్కల్ ప్రజావాణిలో దరఖాస్తులు నిల్

జుక్కల్ ప్రజావాణిలో దరఖాస్తులు నిల్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఎవరూ దరఖాస్తులు చేయలేదని ఇంచార్జి తహసిల్దార్ హేమలత తెలిపారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో ఆర్ ఐ రాంపటేల్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎంపీఓ రాము, మాత్రమే పాల్గొన్నారు. ఇతర శాఖల మండల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ప్రజల సమస్యలు పట్టించుకునే తీరిక వాళ్లకు లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. జక్కల్ మారుమూల ప్రాంతం కావడంతో జిల్లా అధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఉండదనే ధీమాతోనే అధికారులు పాల్గొనడానికి విముఖత చూపుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా మండలాధికారులు నిర్లక్ష్యపు నీడల్ని వీడి, ప్రజలకు అందుబాటులో ఉండాలని పలువురు వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రజల అభ్యర్థనలు, దరఖాస్తులకు తీసుకొని సమస్యలు పరిష్కరించేందుకు సిద్దంగా ఉండాలని ఈ సందర్బంగా కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad