Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తులు

9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తులు

- Advertisement -

జర్నలిస్టులకు సమాచార కమిషనర్‌ పిలుపు
కలెక్టర్లకు లేఖ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జర్నలిస్టులు ఈనెల తొమ్మిదో తేదీ నుంచి సమాచార శాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌ ప్రియాంక తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా యాజమాన్యాలు, వాటిలో విధులు నిర్వర్తించే జర్నలిస్టులకు సూచించారు. జీవోలు 252 ద్వారా అక్రిడిటేషన్ల మార్గదర్శకాలు, జీవో 103 ద్వారా సవరణల వివరాలను తెలియజేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. జిల్లాల్లో అక్రిడిటేషన్‌ కమిటీలు ఏర్పడిన తర్వాత అక్రిడిటేషన్లను జారీ చేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణం అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -