Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

గురుకుల పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం:  స్థానిక గిరిజన గురుకులం బాలికలు, బాలుర కళాశాల కాటారం ప్రిన్సిపల్స్ అయిన ఎన్ నాగలక్ష్మి, ఎ.మాధవి గార్లు తెలుపుతూ .. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలో 5తరగతితో పాటు 6 నుంచి 9 తరగతి వరకు 2026 -27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ధరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 21 వరకు ఆన్లైన్లో 100, రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.  ప్రవేశ పరీక్ష 2026 ఫిబ్రవరి 22న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పూర్తి వివరాలకు ఆయా సంక్షేమ శాఖల వెబ్సైట్లను సందర్శించాలని కోరింది అదనపు సమాచారం కోసం 040-23391598, 040-24734899 ఫోన్ నెంబర్లలో సంప్రదించ వచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -