– ప్రిన్సిపాల్ సంగీత
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాల డీఈఓ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పోస్ట్ ను అవుట్ సోర్సింగ్ పద్ధతి లో భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సంగీత శనివారం ఆసక్తి గల మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డిగ్రీ,కంప్యూటర్ పి.జి.డి.సి.ఏ అర్హత తో పాటు అనుభవం గల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అని తెలిపారు.అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు, విద్యా అర్హత దృవీకరణ పత్రాలు,ఆధార్ నకలు,రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను నేరుగా పాఠశాల లో ఈ నెల 8 వ తేదీ సోమవారం నుండి 12 వ తేదీ శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాల పని వేళల్లో అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు క్రింది ఫోన్ నెంబర్ 7337233879 కు ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES