నవతెలంగాణ – డిచ్ పల్లి
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో ఆగష్టు 28 నుండి ప్రారంభం అయ్యే శిక్షణలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. టైలర్ శిక్షణా 31 రోజులు (28 ఆగష్టు), మగ్గం వర్క్ 31 రోజులు( 28 ఆగష్టు), బ్యూటీ పార్లర్ 35 రోజులు( సెప్టెంబర్ 5) నుండి మొదలవుతుందని ఆయన వివరించారు. ఉచిత శిక్షణ తో పాటుగా ఉచిత భోజన సదుపాయం, మరియు హాస్టల్ వసతి సైతం సంస్థనే సమకూరుస్తుందని పేర్కొన్నారు. శిక్షణా అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేయడం జరుగుతుందన్నారు.
శిక్షణకు కావాల్సిన అర్హతలు 19 నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండి నిజామాబాద్ , మరియు కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవి కుమార్ తెలియజేశారు. శిక్షణ పై ఆసక్తి ఉన్న వారు వచ్చేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ , 10 వ తరగతి ధ్రువీకరణ పత్రం , ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలను తమ వెంట తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవలని సూచించారు.ఏదైనా సమాచారం కోసం ఎస్‌బిఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్పూర్ రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 08461- 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు.
మహిళల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES