నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో చదువుకునే విద్యార్థినిల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి స్వప్న ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తుల కొరకు విద్యార్థినిలు తమ వెంట ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. ఎంపిక విధానం అభ్యర్థులను కేవలం మెరిట్ జాబితా ఆధారంగా మాత్రమే ఎంపిక చేయబడుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఆసక్తిగల విద్యార్థినిలు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో చదువుకోడానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అర్హులైన వారికి కోరడం జరిగింది.
గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్ స్వప్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES