Tuesday, March 17, 2026
E-PAPER
Homeఖమ్మంరైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం

రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నియోజకవర్గం వ్యాప్తంగా కొత్తగా పట్టా పొందిన రైతులు 529 మంది
– ఏడీఏ పెంటేల రవి కుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ మద్య కాలంలో కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు రైతు భరోసా నిదుల కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అశ్వారావుపేట అదనపు సంచాలకులు పెంటేల రవి మంగళవారం తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తం గా ఇటీవల పట్టా పొందిన రైతులు నియోజకవర్గం లోని 5 మండలాల్లోని 17 క్లస్టర్ ల పరిధిలో 163 రెవిన్యూ గ్రామాల్లో మొత్తం 529 మంది ఉన్నారు అని తెలిపారు.

28 ఫిబ్రవరి 2026 వ తేదీ వరకు భూ భారతి లో వచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలకు రైతు భరోసా వర్తిస్తుంది అని,కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, గత సీసన్ లో బ్యాంకు అకౌంట్ నెంబర్ అందజేయని రైతులు,రైతు భరోసా నిధులు అకౌంట్ లో జమ అయ్యాయని మొబైల్కు మెసేజ్ వస్తుంది కావున,రైతులు మొబైల్ నెంబర్ కూడా అప్ డేట్ అయ్యేలా చేసుకోవటానికి గడువు 25/03/2026 వరకు అంటే ఈ నెల 25 వ తేదీ నాటికి ఉందని రైతులు గమనించాలి అన్నారు.

వీరు రైతు పట్టా పాస్ బుక్ జిరాక్స్,రైతు ఆధార్ కార్డు జిరాక్స్, రైతు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్,రైతు నామిని( వైఫ్ /హస్బెండ్ / కొడుకు) ఆధార్ కార్డు జిరాక్స్,ఫోన్ నెంబర్ వివరాలు తో ఆయా గ్రామాల ఏఈఓ లేక ఆ మంండల వ్యవసాయ శాఖా అధికారికి దరఖాస్తు చేసుకోవాలి అని కోరారు.

మండలం                 క్లస్టర్ లు   గ్రామాలు      రైతులు 

అన్నపురెడ్డిపల్లి           2                17              26

అశ్వారావుపేట           4                46             122

చండ్రుగొండ                3                12               41

దమ్మపేట                   4                 25             216

ములకలపల్లి              4                 63            124

మొత్తం                    17                163          529

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -