Tuesday, April 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసా నిధుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

రైతు భరోసా నిధుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

జుక్కల్ ఏవో మహేశ్వరి
నవతెలంగాణ – జుక్కల్ 

అర్హులై ఉండి ఇప్పటివరకు రైతు భరోసా రాని రైతులందనరూ వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రైతు భరోసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆమె వెల్లడించారు. ముందుగా .. 1) రైతు భరోసా అప్లికేషన్, 2). పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ, 3). ఆధార్ కార్డు, 4) బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ, 5). క్యాన్సిల్ చేసిన చెక్కు, 6). మొబైల్ నెంబర్, దరఖాస్తుతో పాటు జిరాక్స్ కాపీలు ప్రస్తుతం కనిపించే విధంగా జతపరచాలని సూచించారు. దరఖాస్తు దారులు మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధిలకు కలిసి వివరాలను అందజేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను సమర్పించే వారికి మార్చి 27 చివరి రోజుగా ప్రభుత్వము గడువు విధించిందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -