- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: మండలంలోని తపాలపురం గ్రామంలో ఉన్న ఎస్సీ బాయ్స్ వసతి గృహంలో ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బాయ్స్ వసతి గృహంలో 100 మంది ఎస్సీ విద్యార్థులకు అవకాశం ఉందన్నారు. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనము దుస్తులు పుస్తకాలు నోటు పుస్తకాలు టైఫాయిడ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
- Advertisement -