నవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ప్రదానం చేయనున్న “శ్రమశక్తి అవార్డులకు” దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా సహాయ కార్మిక కమిషనర్ కొమురుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 1న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా ఉత్తమ మేనేజ్‌మెంట్స్‌కు ఈ అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్మిక రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కంపెనీలు, ఫ్యాక్టరీలు, సంస్థల మేనేజ్‌మెంట్లు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులు ఈ అవార్డులకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా సహాయ కార్మిక కమిషనర్ కామారెడ్డి కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



