Sunday, April 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సబ్సిడీతో కూరగాయల ప్లాస్టిక్ పెట్టెలకు దరఖాస్తుల ఆహ్వానం

సబ్సిడీతో కూరగాయల ప్లాస్టిక్ పెట్టెలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ నియోజకవర్గంలోని  ఆయా మండలాలకు చెందినరైతులకు 50 శాతం సబ్సిడీ కింద కూరగాయల ప్లాస్టిక్ కోసం పెట్టెలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ముధోల్ ఆర్టికల్చర్ అధికారి ఎస్‌కే జావిద్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో పెట్టె ధరపై 50% సబ్సిడీ వర్తింపజేసి, రైతులకు కేవలం రూ.169కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతుకు గరిష్టంగా 25 పెట్టెల వరకు మంజూరు చేయనున్నట్లు వివరించారు.

నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన ఆసక్తిగల రైతులు తమ సంబంధిత పత్రాలతో ఆర్టికల్చర్ కార్యాలయాన్ని సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -