నవతెలంగాణ – రామారెడ్డి
సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి భాను శ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్సిడీపై బ్యాటరీ/ఫుట్/మానువల్ స్ప్రేయర్లు – 160, పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్లు – 24, రోటావేటర్లు – 10,సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ – 3,డిస్క్ హారో / కల్టివేటర్లు / ఎం.బి ప్లౌ / కేజ్ వీల్స్ – 12, బండ్ ఫార్మర్ – 1, పవర్ వీడర్ – 1, బ్రష్ కట్టర్ – 2,పవర్ టిల్లర్ – 1, స్ట్రా బేలర్లు – 2 అందుబాటులో ఉన్నాయని. అవసరమున్న రైతులు రైతు వేదికలో ఏఈఓ కు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్ బుక్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ట్రాక్టర్ పరికరాల కోసం ట్రాక్టర్ ఆర్ సి జిరాక్స్, తో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.
సబ్సిడీ పనిముట్లకు దరఖాస్తు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES