Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీలో తాత్కాలిక పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

కేజీబీవీలో తాత్కాలిక పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

- Advertisement -
  • – మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి
    నవతెలంగాణ -రాయపోల్
  • రాయపోల్ మండల కేంద్రంలోనీ కేజీబీవీ పాఠశాలలో హెడ్ కుక్(1), స్వీపర్(1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ కేజీబీవీ పాఠశాలలో పోస్టులకు దరఖాస్తులను చేసుకోవడానికి తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు స్థానికులైన మహిళలు కావాలని పేర్కొన్నారు. హెడ్ కుక్ పోస్ట్ కి పదవ తరగతి చదివిన వారు ,360 మందికి వంట చేయగల సామర్థ్యం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే స్వీపర్  పోస్ట్ కి 7 వ తరగతి అర్హత కలిగి ఉండాలని తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాలలో దరఖాస్తు చేసుకోవడానికి 29/08/2025 నుండి 03/08/2025 వరకు దరఖాస్తుల్ని పాఠశాలలో తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అర్హులైన మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. తదనంతరం ఇంటర్వ్యూ , డెమో నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుందని తెలిపారు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -