నవతెలంగాణ- రాయపోల్
రాయపోల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తెలుగు, గణితం కళాశాలలో అతిథి అధ్యాపక ఇంగ్లీష్ పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నమని, ఆగస్టు 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరని కేజీబీవీ ప్రత్యేక అధికారి సుగంధ లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాయపోల్ కేజీబీవీ పాఠశాలలో తెలుగు, గణితం సబ్జెక్టులు బోధించుటకు సంబంధింత సబ్జెక్టులలో డిగ్రీ మరియు బీఎడ్ అర్హత కలిగి ఉండవలెను.అలాగే కళాశాలలో ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగానే ఎంపిహెచ్డబ్ల్యు, ఎమ్మెల్టీ రెండు గ్రూపులకు సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించుటకు ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలియజేసారు. దీనికి సంబంధించి ఇంగ్లీషు సబ్జెక్ట్ బోధించుటకు బీఈడీ మరియు ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసిన అర్హత కలిగిన వారు దరఖాస్తు కోసం కేజీబీవీ పాఠశాల కార్యాలయంలో ఆగస్టు 4 వ తేదీ సాయంత్రం 4:00 లోపు దరఖాస్తు చేసుకోగలరని ఆమె పేర్కొన్నారు.
కేజీబీవీలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES