నవతెలంగాణ – చేర్యాల
జిల్లా ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రణీత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాటని 1,జువాళోజి 1,కామర్స్ 1,ఇంగ్లీష్ 1,హిస్టరీ 1,పొలిటికల్ సైన్స్ 1,కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సులలో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని (ఎస్సీ, ఎస్టీ లకు 50 శాతం సరిపోతుంది) ఎన్ఈటీ,ఎస్ఈటీ.పీహెచ్. డీ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈ నెల 24 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించ బడుతున్నట్టు పేర్కొన్నారు. 25 శుక్రవారం ఉదయం 10.30 నుండి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి )లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు తెలిపారు. మిగతా సమాచారం కోసం తమను సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ప్రణీత కోరారు.
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES