- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ అతిధి ఉపాధ్యాయురాలు (గెస్ట్ ఫ్యాకల్టీ) గా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎంఈఓ ఝాన్సీ రాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విషయము నందు డిగ్రీ మరియు బీఈడీ కలిగిన వారు దరఖాస్తు కు అర్హులని తెలిపారు. ఈ నెల 30 నుండి నవంబర్ 1 వ తేదీ వరకు కేజీబీవీ పాఠశాల నందు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తులను పరిశీలించి మరియు డెమో అనంతరం ఎంపిక చేయబడుతుందని ఆమె తెలిపారు.
- Advertisement -



