Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

ఈ నెల 15 రిజిస్ట్రేషన్‌కు తుదిగడువు
వచ్చేఏడాది సెప్టెంబర్‌లో షాంఘైలో నిర్వహణ : ఉపాధి కల్పన, శిక్షణ శాఖ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ప్రశాంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ప్రశాంతి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 63 కేటగిరీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఈనెల 15 వరకు తుది గడువు ఉందని వివరించారు.
ఇది స్కిల్‌ ఒలింపిక్స్‌లాంటిదని అన్నారు. ఆరు నుంచి 24 ఏండ్ల వయస్సున్న వారు ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5,500 మంది దరఖాస్తు చేశారని అన్నారు. నవంబర్‌లో రాష్ట్రంలో జోనల్‌ స్థాయి, డిసెంబర్‌లో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తామని వివరించారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ స్థాయి, ఫిబ్రవరిలో జాతీయ స్థాయి పోటీలుంటాయని చెప్పారు. సెప్టెంబర్‌లో చైనాలోని షాంఘైలో ప్రపంచస్థాయి పోటీలు జరుగుతాయని అన్నారు. ఇందులో 89 దేశాలు పాల్గొంటాయన్నారు. అర్హులైన వారు స్కిల్‌ ఇండియా డిజిటల్‌ పోర్టల్‌ https://www.skillindiadigital.gov.in/home ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. యువత వారి నైపుణ్యాన్ని అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శించడానికి అవకాశముందని వివరించారు. సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ టెక్నాలజీ, ఉత్పత్తి రంగం, ఐటీ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌, పరిపాలన, ఎలక్ట్రానిక్స్‌, బ్రిక్‌ లేయింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టాలేషన్‌, వంట చేయడం, బేకరీ, లాండ్‌స్కేప్‌ గార్డెనింగ్‌ వంటివాటితోపాటు ఇతర అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించొచ్చని చెప్పారు.
నిరక్షరాస్యులైనా నైపుణ్యం ఉంటే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌ యువతకు ఎంతో ఉపయోగమని అన్నారు. విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో చదివే విద్యార్థులు పాల్గొనాలని కోరారు. అందుకోసం వర్సిటీల వీసీలకు లేఖలు రాశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -