- Advertisement -
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను సానుకూలంగా స్పందించారు. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -